Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తెలంగాణ బీజేపీ చీఫ్‌గా డీకే అరుణ?

  • ఇతర పార్టీల నుంచి వచ్చిన వారూ బీజేపీ చీఫ్ కావొచ్చన్న మురళీధర్‌రావు
  • అరుణ అయితేనే టీఆర్ఎస్‌ను టార్గెట్ చేయగలరన్న భావన
  • అధిష్ఠానం నుంచి అరుణకు హామీ?
తెలంగాణ బీజేపీ చీఫ్‌గా డీకే అరుణ నియమితులు కానున్నారన్న వార్తలు తెలంగాణ రాజకీయాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఊహాగానాలకు బీజేపీ సీనియర్ నేత మురళీధర్‌రావు చేసిన వ్యాఖ్యలు బలం చేకూరుస్తున్నాయి. ఇటీవల ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు కూడా బీజేపీ అధ్యక్షులు కావొచ్చని వ్యాఖ్యానించారు. దీంతో తెలంగాణ బీజేపీ పగ్గాలు అరుణకు దక్కే అవకాశాలున్నాయన్న ప్రచారం జోరందుకుంది.

మరోవైపు, ఈ పదవి కోసం ఢిల్లీ స్థాయిలో ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, డీకే అరుణను దృష్టిలో పెట్టుకునే మురళీధర్‌రావు ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారన్న చర్చ కూడా మొదలైంది. మరోవైపు, అధిష్ఠానం నుంచి అరుణకు ఇప్పటికే హామీ వచ్చినట్టు కూడా ప్రచారం జరుగుతోంది. టీఆర్ఎస్‌ను ఆమె అయితేనే దూకుడుగా ఎదుర్కోగలరన్న భావన అధిష్ఠానంలో ఉందని చెబుతున్నారు.
DK Aruna
BJP
Telangana

More Telugu News